జెన్నిఫర్ లోపెజ్ బంగ్లాలో రవితేజ మూవీ షూటింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జెన్నిఫర్ లోపెజ్ బంగ్లాలో రవితేజ మూవీ షూటింగ్

  • శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ 
  • విదేశాల్లో మొదలైన షూటింగ్ 
  • ఆనందంతో పొంగిపోతోన్న శ్రీను వైట్ల  
రవితేజ హీరోగా శ్రీను వైట్ల 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలోని న్యూయార్క్ సమీపంలోని లాంగ్ ఐ లాండ్ లోని హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ బంగ్లాలో జరుగుతోందని శ్రీను వైట్ల ట్వీట్ చేశాడు. తన ఆరాధ్య దేవత గతంలో నివసించిన బంగ్లాలో షూటింగ్ చేయడం తనకి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తోందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశాడు. హాలీవుడ్ స్టార్ .. పాప్ సింగర్ గా జెన్నిఫర్ లోపెజ్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వున్నారు. కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన ఆమె, గతంలో ఈ బంగ్లాలో నివాసం ఉండేది. అక్కడ షూటింగ్ చేస్తోన్న శ్రీను వైట్ల తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. 
srinu vaitla
Raviteja

More Telugu News