భగత్ సింగ్ ని ఉరితీసింది ఇక్కడే ! : దర్శకుడు రాజమౌళి
- లాహోర్ లోని షాద్మన్ చౌక్ ప్రాంతం ఇది
- ఈ ప్రాంతాన్ని చూస్తుంటే రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి
- ఓ ట్వీట్ చేసిన రాజమౌళి
‘నాడు బ్రిటిష్ వాళ్లు భగత్ సింగ్ ను ఉరితీసిన లాహోర్ లోని షాద్మన్ చౌక్ ప్రాంతం ఇది .. ఈ ప్రాంతాన్ని చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి’ అని తన ట్వీట్ లో పేర్కొన్న రాజమౌళి, ఓ ఫొటోను పోస్ట్ చేశారు. కాగా, 1931 మార్చి 23న బ్రిటిష్ హై కమిషనర్ సాండర్స్ ను కాల్చి చంపాడనే అభియోగం కింద భగత్ సింగ్ తో పాటు రాజ్ గురు, సుఖ్ దేవ్ లను లాహోర్ లో ఉరి తీశారు.