తేజ .. వెంకీ మూవీపై ఫిల్మ్ నగర్ టాక్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తేజ .. వెంకీ మూవీపై ఫిల్మ్ నగర్ టాక్

  • వెంకటేశ్ తో దర్శకుడు తేజ
  • కథలో మార్పులు చేర్పులు 
  • స్క్రిప్ట్ పై తేజ కసరత్తు
తేజ దర్శకత్వంలో వెంకటేశ్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితం ఈ సినిమాను లాంచ్ చేశారు. ఆ తరువాత ఈ సినిమా గురించిన సందడి ఎక్కడా కనిపించలేదు. అయితే స్క్రిప్ట్ విషయంలో సురేశ్ బాబు అసంతృప్తిగా ఉన్నాడనీ, కొన్ని మార్పులు .. చేర్పులు చెప్పారని అంటున్నారు.

ఆయన సూచనల మేరకు స్క్రిప్ట్ పై తేజ కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆలస్యం అవుతోందని అంటున్నారు. స్క్రిప్ట్ విషయంలో ఓకే అనుకున్న తరువాత ఈ సినిమాపై దృష్టి పెట్టొచ్చనీ .. ఈలోగా అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లాలని వెంకీ నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. వెంకటేశ్ .. నాగచైతన్యలతో అనిల్ రావిపూడి ఒక మల్టీ స్టారర్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్ తరువాతనే వెంకీతో తేజ రెగ్యులర్ షూటింగుకి వెళతాడేమో అనే అభిప్రాయాలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి.   
venkatesh
chaitu

More Telugu News