మనమంతా దక్షిణ భారతీయులం: పార్లమెంటులో అన్నాడీఎంకే ఫ్లోర్ లీడర్ తో చంద్రబాబు

  • మేము కేంద్ర ప్రభుత్వ అన్యాయంపై పోరాడుతున్నాం
  • మనమంతా దక్షిణ భారతీయులం.. అవిశ్వాసానికి మద్దతు ఇవ్వండన్న బాబు
  • అధిష్ఠానంతో భేటీ అయి నిర్ణయం తీసుకుంటామన్న వేణుగోపాల్
విభజన హామీలను సాధించుకునే క్రమంలో, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పార్లమెంటుకు చేరుకున్న ముఖ్యమంత్రి సెంట్రల్ హాల్లో వివిధ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమవుతున్నారు. ముందుగా అన్నాడీఎంకే ఫ్లోర్ లీడర్ వేణుగోపాల్ తో ఆయన చర్చించారు.

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మనమంతా దక్షిణ భారతీయులమని... ఏపీకి జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్న తమకు మద్దతు ఇవ్వాలని విన్నవించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ, తమ పార్టీ అధిష్ఠానంతో భేటీ అయి, దీనిపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబుకు తెలిపారు. 
Go Back to Shorts
Chandrababu
aiadmk
parliament
meeting

More Telugu News