ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని నేనెప్పుడూ సినిమాలు ఒప్పుకోలేదు: హీరో రామ్ చరణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని నేనెప్పుడూ సినిమాలు ఒప్పుకోలేదు: హీరో రామ్ చరణ్

  • నేను అలాంటి యాక్టర్ ని కాదు
  • నాకు అలాంటి ఆలోచనే ఉంటే ‘రంగస్థలం’ వచ్చేది కాదు
  • ఇలాంటి విజయాలు సినీ పరిశ్రమకు కావాలి
ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని, కమర్షియల్ గా ఆలోచించి తానెప్పుడూ సినిమాలు ఒప్పుకోలేదని, తాను అలాంటి యాక్టర్ ని కాదని, అలాంటి ఆలోచనే ఉంటే ‘రంగస్థలం’ వచ్చేది కాదని ప్రముఖ హీరో రామ్ చరణ్ అన్నారు. హైదరాబాద్ లో ‘రంగస్థలం’ విజయోత్సవ సభ ఈరోజు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్ మాట్లాడుతూ, ఈ సినిమా విజయం కోసం చిత్ర బృందం ఎంతో కృషి చేసిందని, వారందరికీ తన కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నాడు. సినిమా విజయం సాధించి అందరికీ పది రూపాయలు వస్తే, విజయం సాధించిన దాని కన్నా ఎక్కువ సంతోషంగా ఉంటుందని చెప్పాడు. ఇలాంటి విజయాలు సినీ పరిశ్రమకు కావాలని, వేసవిలో విడుదల కాబోయే చిత్రాలు కూడా మంచి విజయం సాధించాలని తాను కోరుకుంటున్నానని చరణ్ అన్నారు.
Ramcharan
ranghasthalam

More Telugu News