అందుకే, వైసీపీ ఎంపీలు ఢిల్లీలో దీక్షకు దిగుతున్నారు: టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్

  • చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు 
  • చంద్రబాబు ఏదో చేస్తారేమోనని వైసీపీ భయం
  • విజయ సాయిరెడ్డి రోజుకో రకంగా మాట్లాడుతున్నారు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళుతున్నారని, ఆయన ఏదో చేస్తారేమోనని ఆందోళన చెందిన వైసీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తామని అంటున్నారని టీడీపీ ఎంపీ సీఎం ర‌మేష్ విమర్శించారు. ఈ రోజు ఆయ‌న పార్ల‌మెంటు వెలుప‌ల మీడియాతో మాట్లాడుతూ... కేసుల నుంచి బయట పడడానికి బీజేపీతో కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని, విజయ సాయిరెడ్డి రోజుకో రకంగా మాట్లాడుతున్నారని అన్నారు.

చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు విజయసాయిరెడ్డికి లేదని, మీడియాలో హైలైట్ కావాలని ఆయ‌న‌ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. పార్లమెంటులో నిలదీయకుండా మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారని, ఆర్థిక నేరాల కేసుల్లో ఏ2గా ఉన్న వ్యక్తి చంద్రబాబును విమర్శించడమేంటని అన్నారు. వైసీపీ నేతలు తప్పుడు విధానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపిన ఇతర పార్టీల ఎంపీలను కలుస్తామ‌ని అన్నారు.
Go Back to Shorts
CM Ramesh
Andhra Pradesh
Special Category Status

More Telugu News