పోయిన పర్సు పార్శిల్ రూపంలో వస్తే...! పుణె మహిళను సంబరపెట్టిన దొంగ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోయిన పర్సు పార్శిల్ రూపంలో వస్తే...! పుణె మహిళను సంబరపెట్టిన దొంగ

  • కారులో ఉన్న పర్సు... అద్దాలు పగులగొట్టి చోరీ
  • పర్సులో నగదు, డ్రైవింగ్ లైసెన్స్
  • డ్రైవింగ్ లైసెన్స్ ను మాత్రం పార్శిల్ రూపంలో పంపించిన దొంగ
 దొంగల్లో ఈ దొంగ కాస్తంత మంచితనం ప్రదర్శించాడు. అందుకే తన చర్యతో పుణె మహిళను సంబరపడేలా చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలు.. పుణెకు చెందిన స్వప్నాదే గత నెల 28న తనకు వచ్చిన ఓ పార్సిల్ చూసి ఆశ్చర్యపోయింది. అందులో పోయిందనుకున్న తన డ్రైవింగ్ లైసెన్స్ కనిపించడంతో ఆమె తెగ ఆనందపడిపోయింది. మార్చి 17న ఆమె పర్స్ చోరీకి గురైంది. పార్క్ చేసి ఉన్న ఆమె కారు అద్దాలను బద్దలు కొట్టి, బ్రాండెడ్ పర్స్, అందులో రూ.1,500 నగదు, డ్రైవింగ్ లైసెన్స్, విలువైన పత్రాలను గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు.

అయితే, పర్స్ ను కాజేసుకుపోయిన చిల్లర దొంగ అందులోని డ్రైవింగ్ లైసెన్స్ తో పనిలేదనుకున్నాడో, లేక దాన్ని పారేస్తే కార్డు హోల్డర్ కు కష్టాలు వస్తాయనుకున్నాడో గానీ భద్రంగా ప్యాక్ చేసి కార్డులో ఉన్న చిరునామాకు పోస్ట్ చేశాడు. నిజానికి ఆమె కార్డులో ఉన్న ఇంటిని ఖాళీ చేసి మరో ఇంటికి మారిపోయింది. అయితే, పార్సిల్ అక్కడి నుంచి తిరిగి ఆమె ఉంటున్న చిరునామాకు వెళ్లి డెలివరీ అయింది. దొంగ తన డ్రైవింగ్ లైసెన్స్ ను తిరిగి పంపడం ద్వారా ఎంతో సమయం ఆదా చేశాడని అతడ్ని మెచ్చుకుంది స్వప్నాదే.
THEIF
PINE

More Telugu News