Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బన్నీతో సినిమా గురించి సుకుమార్

  • 'రంగస్థలం'తో హిట్ కొట్టిన సుకుమార్ 
  • నెక్స్ట్ ప్రాజెక్టు పై దృష్టి 
  • కథను బట్టే హీరో ఎంపిక
చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'రంగస్థలం' మూవీ భారీ వసూళ్లను రాబడుతూ సూపర్ హిట్ టాక్ తెచ్చేసుకుంది. దాంతో అంతా కూడా సుకుమార్ నెక్స్ట్ మూవీ ఏ హీరోతో వుండనుందనే ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలోనే తెరపైకి బన్నీ పేరు వచ్చింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రావడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయాన్ని గురించి తాజాగా సుకుమార్ ప్రస్తావించాడు. "నా దగ్గర రెండు మూడు కథలు వున్నాయి. ఇంతవరకూ వాటిని ఏ హీరోకు వినిపించలేదు .. బన్నీకి కూడా. ముందుగా ఆ కథల్లో దేనిని మొదలుపెట్టాలి .. ఆ కథకు ఎవరు సెట్ అవుతారనే క్లారిటీ నాకు రావలసి వుంది. అప్పుడు హీరోను ఎంచుకునే ప్రక్రియను మొదలుపెడతాను. హీరో ఎవరైనా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోనే నా సినిమా ఉంటుంది. ఇక దర్శకుడిగా నా తదుపరి చిత్రంతో పాటు, నేను నిర్మాతగా వ్యవహరించనున్న మరో సినిమా కూడా ఆరంభమవుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.  
sukumar
Allu Arjun

More Telugu News