సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • వెంకీ సినిమా నుంచి తప్పుకున్న శ్రియా 
  • 'సాహో' కోసం ఇరవై నిమిషాల యాక్షన్ ఎపిసోడ్
  • 'యూ టర్న్'కి రెడీ అవుతున్న సమంత    
*  కథానాయిక శ్రియా ఇటీవల పెళ్లి చేసుకోవడంతో, తను ఇప్పటికే కమిట్ అయిన కొన్ని సినిమాలను వదులుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందే చిత్రం కూడా వుంది. ఈ చిత్రాన్ని కూడా ఆమె డ్రాప్ చేసుకోవడంతో మరో నాయిక కోసం తేజ వెతుకుతున్నారు.
*  ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' చిత్రం షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. ప్రభాస్, కొంత మంది ఫైటర్లపై చిత్రీకరిస్తున్న ఈ యాక్షన్ దృశ్యాలు ఇరవై నిమిషాల పాటు ఉంటాయని, చిత్రంలో ఇవి కీలకమని అంటున్నారు.  
*  తాజాగా 'రంగస్థలం' చిత్రంతో విజయాన్ని సొంతం చేసుకున్న కథానాయిక సమంత ప్రస్తుతం భర్తతో కలసి అమెరికాలో హాలిడే ఎంజాయ్ చేస్తోంది. అటు నుంచి హైదరాబాదుకి రాగానే వచ్చే వారంలో ఆమె 'యూ టర్న్' చిత్రం షూటింగులో పాల్గొంటుంది. పవన్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. 
Shriya
venkatesh
Prabhas

More Telugu News