Chandrababu: చంద్రబాబు డిప్రెషన్ లో ఉన్నారు : సోము వీర్రాజు

  • చంద్రబాబు తన అవినీతిని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు
  • రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు చేసిందేమీ లేదు
  • చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్
ఏపీ సీఎం చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు తికమకగా, డిప్రెషన్ లో ఉన్నారని, తన అవినీతిని కప్పుపుచ్చుకునేందుకుని మోదీపై తిరగబడాలని ప్రజలకు ఆయన చెబుతున్నారని మండిపడ్డారు.

వాస్తవం చెప్పాలంటే రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబునాయుడు చేసిందేమీ లేదని, ఆయనపై రాయలసీమ ప్రజలు తిరగబడాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ అని ఆరోపించిన సోము వీర్రాజు, బాబుకు దమ్ముంటే రాయలసీమలో తిరగాలని అన్నారు. స్కూల్ విద్యార్థుల యూనిఫాం కోసం చెన్నై నుంచి క్లాత్ తెచ్చి ‘ఆప్కో’లో కొన్నట్టుగా చెబుతూ మోసం చేస్తున్నారని, చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు.
Chandrababu
somu veeraj

More Telugu News