'ఈ అవమానం నన్ను చంపేస్తోంది' అంటూ బోరున విలపించిన మిస్సెస్ వార్నర్
- నా కళ్ల ముందు కనిపించిన దృశ్యాలను నమ్మలేకపోయా
- నా బిడ్డలను కూడా ఆడిపోసుకుంటున్నారు
- తన హృదయం బద్దలైందన్న వార్నర్ భార్య కాన్ డైస్
డేవిడ్ భార్యగా, ఈ తప్పు వెనక తాను కూడా ఉన్నట్టుగా భావిస్తున్నానని, ఎనిమిది రోజుల క్రితం ట్యాంపరింగ్ ఆరోపణలు వచ్చిన నాడు తాను కూడా స్టేడియంలో ఉన్నానని గుర్తు చేసుకున్న ఆమె, 'సిడ్నీ సండే టెలిగ్రాఫ్'కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ, తన కళ్లముందు జరిగిన ఘటనలను, చూసిన దృశ్యాలను మరచిపోలేకపోతున్నానని వాపోయింది. ఈ కుంభకోణంలో తన భర్త పాత్ర లేదని తాను వ్యాఖ్యానించడం లేదని, ఆయన్ను క్షమించాలని కూడా అనడం లేదని, అయితే, ఆఖరికి తమ బిడ్డలను కూడా నిందించడం ఏ మేరకు భావ్యమని ప్రశ్నించింది. ఇంటికి వచ్చిన డేవ్, బెడ్ రూములో ఏడుస్తూ కూర్చుంటే, తన హృదయం బద్దలైందని వ్యాఖ్యానించింది.