ప్రాణాలు పోయినా సరే... షమీ దుర్మార్గుడనే చెబుతాను: హసీన్ తాజా ఆరోపణలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రాణాలు పోయినా సరే... షమీ దుర్మార్గుడనే చెబుతాను: హసీన్ తాజా ఆరోపణలు

  • షమీకి అనుకూలంగా ఉన్న మీడియా
  • తప్పు నేనే చేసినట్టు నిందలు
  • మరిన్ని సాక్ష్యాలు ఉన్నాయన్న హసీన్
తన భర్త, క్రికెటర్ మహమ్మద్ షమీ దుర్మార్గుడేనని, తన ప్రాణాలు పోయినా సరే ఇదే మాట చెబుతానని ఆయన భార్య హసీన్ వ్యాఖ్యానించింది. తాజాగా తన భర్తపై ఆరోపణలు చేసిన ఆమె, కొన్ని మీడియా సంస్థలు షమీకి అనుకూలంగా వార్తలు రాస్తున్నాయని, తానే తప్పు చేసినట్టు నిందలు వేస్తున్నాయని అన్నారు.

షమీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని, అతను తనను లైంగికంగా వేధించాడని, హత్యాయత్నం కూడా చేశాడనటానికి ఆధారాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. షమీకి చాలా మందితో సంబంధం ఉందని, మ్యాచ్ ఫిక్సింగ్ కు కూడా పాల్పడ్డాడని గతంలో హసీన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన బీసీసీఐ, ఆ విషయంలో మాత్రం షమీకి క్లీన్ చిట్ ఇచ్చింది. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన హసీన్, తన వద్ద ఉన్న మరిన్ని సాక్ష్యాలను విడుదల చేస్తానని చెప్పడం గమనార్హం.
Shami
Haseen
Cricket
India
BCCI

More Telugu News