హైదరాబాద్‌లో హనుమాన్ శోభాయాత్ర.. పలు చోట్ల ట్రాఫిక్‌జామ్
- కొనసాగుతోన్న హనుమాన్ శోభాయాత్ర
- ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ముషీరాబాద్ వరకు భారీగా ట్రాఫిక్‌జామ్
- పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి ముషీరాబాద్ వరకు భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. కోఠీలోని పుత్లీబౌలి నుంచి ఆంధ్రాబ్యాంక్ మీదుగా ఊరేగింపు సాగిన నేపథ్యంలో జీపీఓ నుంచి కోఠీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఎంజే మార్కెట్ వైపుగా మళ్లించారు. కింగ్‌కోఠీ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వైఎంసీఏ సర్కిల్ వైపు వెళ్లే వాహనాలను ఈడెన్ గార్డెన్ వైపు మళ్లించారు. అలాగే, పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.