bharath ane nenu: 'ఫర్హాన్ అనే నేను' మహేశ్ బాబు కోసం ఫస్ట్ టైమ్ తెలుగులో పాట పాడాను అంటున్న బాలీవుడ్ నటదర్శకుడు

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న 'భ‌ర‌త్ అనే నేను' సినిమా ఏప్రిల్ 20న విడుద‌లకు సిద్ధమవుతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్, సాంగ్స్‌, టీజ‌ర్ లను విడుద‌ల చేస్తూ చిత్రయూనిట్ ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన పాటను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేయనుంది.

ఈ పాట ప్రత్యేకత ఏంటంటే, ఈ పాటను బాలీవుడ్ రచయిత, నటుడు, దర్శకుడు ఫర్హాన్ అఖ్తర్ పాడడం. ఈ మేరకు ఒక వీడియో విడుదల చేసిన ఫర్హాన్... 'ఫర్హాన్ అనే నేను.. ఫస్ట్ టైమ్ తెలుగులో పాడాను... భరత్ అనే నేను కోసం.. మీకు నచ్చుతుందని విశ్వసిస్తున్నాను' అంటూ ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశాడు. దీనిని మహేశ్ బాబు రీట్వీట్ చేస్తూ, 'తెలుగు సినీ పరిశ్రమకు స్వాగతం...సింప్లీ లవింగ్ ఇట్' అంటూ ఆహ్వానం పలికాడు. ఇది మహేశ్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
bharath ane nenu
farhan aktar
Mahesh Babu

More Telugu News