డేటింగ్ యాప్ లో పరిచయమైన యువకుడి కోసం వెళ్లి శవమై కనిపించిన యువతి!
- న్యూఢిల్లీలో 22వ తేదీ నుంచి కనిపించని యువతి
- హత్య చేసి కిడ్నాప్ డ్రామా ఆడిన యువకుడు
- ప్లాన్ చేసి పట్టేసిన పోలీసులు
ఆపై ఇద్దరూ రాత్రి వరకూ కలిసే ఉన్నారు. నాటి రాత్రి ఏదో విషయంలో గొడవ జరుగగా, ఇష్రత్ ఆగ్రహంతో సుత్తితో ఆమె తలపై కొట్టగా, ఆమె మరణించింది. ఆపై మృతదేహాన్ని డ్రైనేజ్ లో పడేసిన ఇష్రత్, ఆమె తండ్రికి ఫోన్ చేసి, మీ కుమార్తెను కిడ్నాప్ చేశానని, రూ. 50 లక్షలు ఇస్తే వదిలి పెడతానని చెప్పాడు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా, కేసును సీరియస్ గా తీసుకుని దర్యాఫ్తు చేపట్టిన పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ లో యువతితో పాటు ఇష్రత్ కూడా కనిపించాడు. ఆపై అతనికి డబ్బులు ఇప్పిస్తామని ఆమె తండ్రితో చెప్పించిన పోలీసులు, అతనిని రప్పించి, గురువారం నాడు అరెస్ట్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని న్యూఢిల్లీ పోలీసు జాయింట్ కమిషనర్ అజయ్ చౌదరి తెలిపారు.