రాష్ట్రాన్ని కాపాడేందుకు చంద్రబాబు వెంటనే రంగంలోకి దిగాలి: ఉండవల్లి

  • హోదాపై పోరాటాన్ని చంద్రబాబు ముందుండి నడిపించాలి
  • ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు
  • రిట్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి, రాష్ట్రాన్ని కాపాడేందుకు వెంటనే రంగంలోకి దిగాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు పోరాటం చేయాలని చెప్పారు. ప్రత్యేక హోదా పోరాటాన్ని ముందుండి నడిపించాలని కోరారు. కేంద్రంపై న్యాయ పోరాటం చేయాలని సూచించారు.

ప్రత్యేక హోదాకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులలో రిట్ పిటిషన్లు ఉన్నాయని... వీటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పారు. కౌంటర్ ఫైల్ చేయడానికి 24 గంటల సమయం కూడా పట్టదని అన్నారు. చంద్రబాబు బాధ్యతలను నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

అవిశ్వాసంపై చర్చ జరిగేలా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చొరవ తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో తనకున్న విచక్షణాధికారంతో తమను అప్పటి స్పీకర్ సభ నుంచి సస్పెండ్ చేశారని... ఇప్పుడు సభలో ఆందోళన చేస్తున్న అన్నాడీఎంకే సభ్యులను కూడా స్పీకర్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 
Go Back to Shorts
Undavalli
Chandrababu
Special Category Status

More Telugu News