బీజేపీకి షాకిచ్చేందుకే శత్రుఘ్నసిన్హా నిర్ణయం!
- తగిన గౌరవం దక్కడం లేదని అసంతృప్తి
- మమతా బెనర్జీని కలిసిన శత్రుఘ్నసిన్హా
- పాట్నా నుంచి బరిలోకి దిగాలని నిర్ణయం
శత్రుఘ్నసిన్హా వెంట అరుణ్ శౌరీ కూడా ఉండటం గమనార్హం. కాగా, తాను ఏ పార్టీలో చేరాలన్నా పాట్నా టికెట్ ఇవ్వడం తప్పనిసరని, తనకు చాలా పార్టీలు ఇక్కడి నుంచి పోటీకి అవకాశం ఇస్తాయని హామీ ఇచ్చాయని సిన్హా వ్యాఖ్యానించారు. గతంలో పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తూ, దాదాపు 200 సీట్లలో విజయం సాధించుకు వచ్చిన అద్వానీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ప్రతి ఒక్కరికీ తెలుసునని కూడా ఆయన అన్నారు. సిన్హా మాటలు, జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే, నేడో, రేపో ఆయన బీజేపీకి టాటా చెప్పవచ్చన్న అంచనాకు వచ్చేస్తున్నారు విశ్లేషకులు.