కర్ణాటక లేడీ సూపర్ పోలీస్ రూప చుట్టూ మరో వివాదం... అవార్డే ప్రకటించలేదంటున్న బెంగళూరు ఫౌండేషన్
- శశికళ రాజభోగాలను వెలుగులోకి తెచ్చిన రూప
- నమ్మ బెంగళూరు అవార్డును తిరస్కరించినట్టు వార్తలు
- ఖండించిన ఫౌండేషన్
రూపకు తాము ఎటువంటి అవార్డునూ ప్రకటించలేదని, కేవలం అవార్డు పరిశీలనకు ఉన్న పేర్లలో మాత్రమే రూపను చేర్చామని, తుది విజేతను తామింకా ప్రకటించలేదని స్పష్టం చేసింది. అవార్డును ప్రకటించకుండానే, తాము ఇచ్చినట్టు, ఆమె తిరస్కరించినట్టు చెప్పుకోవడం ఏంటని ఫౌండేషన్ ప్రతినిధులు ప్రశ్నించారు. కాగా, రూప తన స్వహస్తాలతో ఓ లేఖ రాస్తూ, అవార్డును తిరస్కరిస్తున్నట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తరహా అవార్డులను ప్రభుత్వ అధికారులకు ఇవ్వరాదని కూడా అభిప్రాయపడ్డారు.