నన్ను విమర్శిస్తే స్క్రీన్ షాట్లు విడుదల చేస్తా: 'జనసేన' పెద్దలకు సుంకర కల్యాణ్ వార్నింగ్
Add ap7am to your home Screen

నన్ను విమర్శిస్తే స్క్రీన్ షాట్లు విడుదల చేస్తా: 'జనసేన' పెద్దలకు సుంకర కల్యాణ్ వార్నింగ్

  • సీనియర్లు టార్గెట్ చేయాలని చూస్తున్నారు
  • ఎవరు ఎక్కడేం వాగుతున్నారో నాకు తెలుసు
  • రెచ్చగొడితే మనశ్శాంతి లేకుండా చేస్తా: సుంకర
జనసేన పార్టీకి చెందిన సీనియర్లు కొందరు తనను టార్గెట్ చేయడంపై, పవన్ కల్యాణ్ అభిమాన సంఘం అధ్యక్షుడు సుంకర కల్యాణ్ దిలీప్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జనసేన పార్టీ పెద్దలు అహంతో ఉన్నారని, తనకు వారికన్నా వందరెట్లు ఎక్కువ అహముందని చెప్పిన దిలీప్, తన జోలికి రావద్దని, ఎవరు ఏం చేస్తున్నారన్న విషయం, ఎక్కడ ఏం వాగుతున్నారన్న విషయాలను బయట పెడతానని హెచ్చరించాడు.

తనపై విమర్శలు చేస్తున్న వారి బాగోతాలకు సంబంధించిన ప్రతి స్క్రీన్ షాట్ తన వద్ద ఉందని అన్నారు. కొన్ని చానల్స్ కు కొందరు ఫోన్లు చేస్తున్నారని, ఇవన్నీ అధినేత పవన్ కు తెలిసే జరుగుతున్నాయో, తెలియక జరుగుతున్నాయో తన వద్ద సమాచారం లేదని చెప్పిన ఆయన, తనను రెచ్చగొట్టిన వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేయడం ఖాయమని అన్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దని పార్టీ పెద్దలను హెచ్చరించారు. కాగా, గత కొన్ని రోజులుగా సుంకర కల్యాణ్ దిలీప్, జనసేనకు దూరమవుతున్న సంకేతాలు వస్తున్న సంగతి తెలిసిందే.
Jana Sena
Pawan Kalyan
KALYAN SUNKARA

More Telugu News