చంద్రబాబుది ముమ్మాటికీ కుట్రే... మేము భాగస్వామ్యం కాబోము: బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు
- నేడు చంద్రబాబు అఖిలపక్ష సమావేశం
- హాజరు కాబోమని చెప్పిన బీజేపీ
- ఇప్పటికే తాము రావడం లేదని చెప్పిన వైసీపీ
చంద్రబాబు కుట్రలో తాము భాగస్వామ్యం కాదలచుకోలేదని, ఈ అఖిలపక్ష సమావేశానికి బీజేపీ హాజరు కాబోదని తేల్చి చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం తాను చేసిన తప్పిదాలను బీజేపీపై నెట్టివేసే ధోరణిలో టీడీపీ ఉందని ఆరోపించారు. కాగా, నేటి అఖిలపక్షానికి హాజరు కాబోమని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.