యువతులకు వివాదాస్పద సలహా ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే!

26-03-2018 Mon 08:16 | National
  • అబ్బాయిలతో స్నేహం చేయకపోవడమే వారికి రక్షణ
  • అబ్బాయిలు కూడా పాశ్చాత్య ఫ్యాషన్‌ను విడిచిపెట్టాలి
  • వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే శాక్య
మధ్యప్రదేశ్‌లోని గుణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శాక్య అమ్మాయిలకు ఉచిత సలహా ఇచ్చి వివాదంలో చిక్కుకున్నారు. అబ్బాయిలతో అమ్మాయిలు స్నేహం చేయడం మానేస్తే ఆటోమెటిక్‌గా వారిపై దాడులు కూడా ఆగిపోతాయని పేర్కొని కలకలం రేపారు. అలాగే అబ్బాయిలకు కూడా ఆయన ఓ విలువైన సలహా ఇచ్చారు. అమ్మాయిలను ఆకర్షించేందుకు పాశ్చాత్య ఫ్యాషన్‌ను అనుకరించడం మానాలని హితవు పలికారు. అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్ లేకపోతేనే వారు క్షేమంగా ఉంటారని పేర్కొన్నారు. శాక్య వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

‘‘అసలు మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు? అబ్బాయిలతో వారు స్నేహం చేయడం ఆపేస్తే వారిపై దాడులు కూడా ఆగిపోతాయి. ఇది వారికే మంచిది కదా’’ అని పేర్కొన్నారు. గుణలోని ఓ ప్రభుత్వ కాలేజీలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఏం చేయాలన్న ఓ విలేకరి ప్రశ్నకు ఆయనీ వివాదాస్పద సలహా ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా మనది కాదని, అది కూడా పాశ్యాత్య సంస్కృతిలో భాగమేనని అన్నారు.

‘‘భారతీయ సంస్కృతిలో మహిళలను గొప్పగా గౌరవిస్తాం. ఏడాదికి నాలుగు సార్లు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. వారిని నాలుగుసార్లు పూజిస్తున్నాం’’ అని శాక్య పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది బాలీవుడ్ నటి అనుష్క శర్మను ఇటలీలో వివాహం చేసుకున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ దేశభక్తిని ప్రశ్నించి అప్పట్లో వార్తల్లోకి ఎక్కారు. తాజాగా యువతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
BJPMLAgirlsadviceMadhya Pradesh

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more