2019 వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే జట్లు ఇవే.. ఈసారి గ్రూపుల్లేవ్!
- మహా సంగ్రామంలో తలపడనున్న పది జట్లు
- ప్రపంచకప్ క్వాలిఫయర్స్ నుంచి విండీస్, ఆఫ్ఘాన్ జట్లు
- వచ్చే ఏడాది మే 30న ఫైనల్స్
ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ జట్టు ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచుల్లో సూపర్ సిక్స్‌లో స్కాట్లాండ్ను ఓడించడం ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఇక వరుసగా తొలి మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్ మాయాజాలంతో సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించి ఐర్లండ్‌ను ఓడించి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈసారి ప్రపంచకప్‌లో ఒకటే గ్రూప్ ఉండనుంది. ఒక్కో జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఆడనుంది. ఇందులో టాప్ ఫోర్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. 30 మే 2019న ఫైనల్ జరగనుంది.