రైలు నుంచి జారిపడి 12 గంటలు మృత్యువుతో పోరాడిన భీమవరం యువతి!
- భీమవరంలోని శ్రీరామపురానికి చెందిన జయంతి రాజేశ్వరి
- విజయవాడ నుంచి భీమవరం వస్తుండగా ప్రమాదవశాత్తూ కాలుజారి కిందపడిన రాజేశ్వరి
- 12 గంటల పాటు మృత్యువుతో పోరాడిన రాజేశ్వరి
ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారిపడిన భీమవరం యువతి 12 గంటలపాటు మృత్యువుతో పోరాడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీరామపురానికి చెందిన జయంతి రాజేశ్వరి (21) విజయవాడ నుంచి పూరి-తిరుపతి ఎక్స్ ప్రెస్ లో భీమవరానికి బయల్దేరింది. రాత్రి 9 గంటల సమయంలో ఆకివీడు గుమ్ములూరు సెంటర్ రైల్వేగేటు సమీపంలో ప్రమాదవశాత్తు కాలుజారి రైలులోంచి కింద పడిపోయింది.
ఆమెను ఎవరూ గుర్తించకపోవడంతో ట్రైన్ వెళ్లిపోయింది. రాజేశ్వరి ట్రాక్ పక్కనే ఉన్న బురదగుంటలో పడిపోవడంతో తీవ్రగాయాలపాలైంది. సుమారు 12 గంటల పాటు మృత్యువుతో పోరాడగా, ఉదయం 9 గంటల సమయంలో రైల్వేగేటు కీమన్ గోపాలకృష్ణ ఆమెను గుర్తించి, రైల్వే కార్మికులతో కలిసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.