TRS: టీఆర్ఎస్ శిఖండి .. కేసీఆర్ సైంధవుడు: ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం విషయంలో తెలంగాణలోని టీఆర్ఎస్, తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీలు శిఖండి పాత్ర పోషిస్తున్నాయని ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. కేసీఆర్ ఓ సైంధవుడిలా అడ్డుపడుతున్నారని, ఏపీ ప్రజలపై ఆయనకు ఏమాత్రం ప్రేమ ఉన్నా కేంద్రంపై అవిశ్వాసానికి ఆయన సహకరించి ఉండేవారని అన్నారు. నంగనాచి మాటలు చెబుతున్న కేసీఆర్, బీజేపీతో లాలూచీ పడ్డారని, మోదీకి ఊడిగం చేస్తున్నారని, కేంద్రంపై అవిశ్వాసతీర్మానం  చర్చకు రాకుండా ఆయన ఆటంకాలు కల్పిస్తున్నారని, అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. ఈ నెల 27న అంబేద్కర్ విగ్రహాల వద్ద రాజ్యాంగ పరిరక్షణ దినం పాటిస్తామని రామకృష్ణ చెప్పారు.
Go Back to Shorts
TRS
cpi
ramakrishna

More Telugu News