ipl: దీపికతో నటించనన్న కోహ్లీ.. ఆర్సీబీకి 11 కోట్ల నష్టం!

బాలీవుడ్‌ నటి దీపికా పదుకునేతో యాడ్‌ లో నటించనని ఐపీఎల్ లో బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పడంతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు యాజమాన్యానికి 11 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దాని వివరాల్లోకి వెళ్తే... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కాంట్రాక్టులోని ఒక క్లాజు ప్రకారం. కోహ్లీ మరే ఇతర సెలబ్రిటీతో యాడ్ షూటింగ్ లో పాల్గొనేందుకు వీలు లేదు.

అదే సమయంలో గోఐబిబో.కామ్ కోహ్లీతో యాడ్ లో నటింపజేసేందుకు ఆర్సీబీతో ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారం ఆ వెబ్ సైట్ కు కోహ్లీ యాడ్ లో నటించాలి. గోఐబిబోకు దీపికా పదుకునే ఇప్పటికే యాడ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపికతో కోహ్లీ నటించాలని ఆర్సీబీకి, గోఐబిబో చెప్పింది. కాంట్రాక్టు ప్రకారం కోహ్లీ మరో సెలబ్రిటీ (దీపిక) తో నటించేందుకు నిరాకరించాడు. దీంతో ఆర్సీబీతో గోఐబిబో 11 కోట్ల విలువైన డీల్ ను రద్దు చేసుకుంది. అలా కోహ్లీ వల్ల ఆర్సీబీకి 11 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 
ipl
rcb
Royal Challengers Bangalore
goibibo
Deepika Padukone
Virat Kohli

More Telugu News