ప్రభాస్ సరసన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా: రకుల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రభాస్ సరసన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా: రకుల్

  • యూత్ లో రకుల్ కి విపరీతమైన క్రేజ్ 
  • తెలుగులో సొంతమైన భారీవిజయాలు
  • తమిళంలోను వరుస సినిమాలు
చిన్న హీరోతో .. చిన్న సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టేసిన రకుల్ .. ఆ తరువాత చకచకా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. రకుల్ అందానికీ .. అభినయానికి అదృష్టం తోడుకావడంతో, వరుస విజయాలు ఆమె సొంతమయ్యాయి. మహేశ్ బాబు .. ఎన్టీఆర్ .. చరణ్ .. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో చాలా తక్కువ గ్యాప్ లో ఆమె సినిమాలు చేసి ఆశ్చర్యపరిచింది.

 ఇక ప్రస్తుతం తమిళ అగ్రకథానాయకుల జాబితాలో కనిపించే సూర్య .. కార్తీ .. శివకార్తికేయన్ లతో ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళుతోంది. తాజాగా ఆమె మాట్లాడుతూ .. ప్రభాస్ తో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది. ప్రభాస్ తో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. 'సాహో' తరువాత ప్రభాస్ చేసే సినిమా కోసం కూడా హీరోయిన్ ఎంపిక జరిగిపోయింది కనుక, రకుల్ కోరిక నెరవేరడానికి చాలా సమయం పట్టొచ్చని అర్థమవుతోంది.        
rakul

More Telugu News