పొలంలో పని చేసేందుకు నిరాకరించిన మైనర్లు.. 2 కిలోమీటర్లు నగ్నంగా నడిపించిన దుండగులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పొలంలో పని చేసేందుకు నిరాకరించిన మైనర్లు.. 2 కిలోమీటర్లు నగ్నంగా నడిపించిన దుండగులు!

  • రాజస్థాన్ లో మైనర్లకు చేదు అనుభవం
  • మోతవ్తా గ్రామంలో పొలం పని చేసేందుకు నిరాకరించిన మైనర్లు
  • మైనర్లను నగ్నంగా నడిపించి, వీడియో తీసిన నిందితులు
పొలంలో పని చేయమన్న మైనర్లను నగ్నంగా నడిపించిన దారుణం రాజస్ధాన్‌ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్ లోని బికనీర్ కు సమీపంలోని మోతావ్తా గ్రామానికి చెందిన వ్యక్తి పొలంలో పనిచేసేందుకు నిరాకరించినందుకు... మైనర్లను కొందరు వ్యక్తులు దుస్తులు విప్పి నగ్నంగా రెండు కిలోమీటర్లు నడిపించారు. ఈ ఘనకార్యాన్ని వారు వీడియో తీసినట్టు బాధితులు చెబుతున్నారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైనర్లను వేధించి, వీడియో తీసినట్టు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని వారు తెలిపారు. దీనిపై మరింత సమాచారం అందాల్సిఉంది. 
Rajasthan
bikaner
moltavtal
harassment
minors

More Telugu News