58 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. ఐదుగురు డక్కౌట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

58 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. ఐదుగురు డక్కౌట్

  • నిప్పులు చెరిగిన బోల్ట్, సౌతీ
  • 20.4 ఓవర్లలో 58 పరుగులు చేసిన ఇంగ్లండ్
  • ఐదుగురు బ్యాట్స్ మన్ డకౌట్
నిప్పులు చెరిగే బంతులతో ట్రెంట్ బోల్ట్, టిమ్ సౌతీ ఇంగ్లండ్‌ పతనాన్ని శాసించారు. ఇంగ్లండ్ తో ఆక్లాండ్ వేదికగా ప్రారంభమైన తొలి డే–నైట్‌ టెస్టు మ్యాచ్‌ లో కివీస్ జట్టు సంచలనాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ జట్టు అద్భుతంగా ఆడింది. నిప్పులు చెరిగే బంతులతో కేవలం 58 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ను కివీస్ బౌలర్లు ఆలౌట్ చేశారు.

ఇందులో జో రూట్‌, బెయిర్‌ స్టో, బెన్ స్టోక్స్‌, మహ్మద్‌ అలీ, స్టువర్ట్‌ బ్రాడ్‌ లను డకౌట్ చేశారు. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ లో ఓవర్టన్‌ (33), స్టోన్‌ మన్‌(11) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 20.4 ఓవర్లలో 58 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లిష్ బ్యాట్స్ మన్ వికెట్లను బోల్ట్‌, సౌతీ పంచుకోవడం విశేషం. మూడేసి మెయిడెన్ ఓవర్లు చేసి వీరిద్దరూ ఆకట్టుకున్నారు. 32 పరుగులిచ్చిన బోల్ట్ 6 వికెట్లు తీయగా, 25 పరుగులిచ్చిన సౌతీ 4 వికెట్లు పడగొట్టాడు.
kiwis
newzialand
england
Cricket

More Telugu News