58 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్.. ఐదుగురు డక్కౌట్
- నిప్పులు చెరిగిన బోల్ట్, సౌతీ
- 20.4 ఓవర్లలో 58 పరుగులు చేసిన ఇంగ్లండ్
- ఐదుగురు బ్యాట్స్ మన్ డకౌట్
ఇందులో జో రూట్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, మహ్మద్ అలీ, స్టువర్ట్ బ్రాడ్ లను డకౌట్ చేశారు. ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ లో ఓవర్టన్ (33), స్టోన్ మన్(11) టాప్ స్కోరర్లుగా నిలిచారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 20.4 ఓవర్లలో 58 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లిష్ బ్యాట్స్ మన్ వికెట్లను బోల్ట్, సౌతీ పంచుకోవడం విశేషం. మూడేసి మెయిడెన్ ఓవర్లు చేసి వీరిద్దరూ ఆకట్టుకున్నారు. 32 పరుగులిచ్చిన బోల్ట్ 6 వికెట్లు తీయగా, 25 పరుగులిచ్చిన సౌతీ 4 వికెట్లు పడగొట్టాడు.