మొన్న సింధు... నేడు శ్రీకాంత్.. డిప్యూటీ కలెక్టర్ గా నియామకం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొన్న సింధు... నేడు శ్రీకాంత్.. డిప్యూటీ కలెక్టర్ గా నియామకం!

  • డిప్యూటీ కలెక్టర్ గా కిదాంబి శ్రీకాంత్ 
  • ఉత్తర్వులు జారీ చేేసిన ప్రభుత్వం
  • ఇండోనేషియా ఓపెన్ సిరీస్ గెల్చుకోవడంతో శ్రీకాంత్ కు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం
క్రీడల్లో రాష్ట్రం కీర్తి ప్రతిష్ఠలను జగద్విదితం చేసిన కిదాంబి శ్రీకాంత్ ను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది జరిగిన ఇండోనేషియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్ ను శ్రీకాంత్ సొంతం చేసుకోవడంతో, గత జూన్ 28న విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన సన్మానసభలో శ్రీకాంత్ కు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 ఆ హామీ మేరకు నేడు శ్రీకాంత్ ను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్పోర్ట్స్ కోటాలో శ్రీకాంత్ ను ఆ పదవిలో నియమిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీంతో గతంలో సింధును డిప్యూటీ కలెక్టర్ ను చేసిన సీఎం, ఇప్పుడు శ్రీకాంత్ ను డిప్యూటీ కలెక్టర్ ను చేశారు. 
kidambi srikanth
deputy collector

More Telugu News