నడి రోడ్డుపై అశ్లీల దృశ్యాలు... అవాక్కైన ప్రజలు!

  • మకాటి నగరంలోని రద్దీ రోడ్డుపై ఎలక్ట్రానిక్ బిల్ బోర్డుపై అశ్లీల దృశ్యాలు
  • 30 సెకెన్ల పాటు ప్రసారమైన అశ్లీల దృశ్యాలు
  • రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్
రద్దీ రోడ్డుపై అశ్లీల దృశ్యాలు ప్రత్యక్షం కావడంతో ఆ రహదారి మీదుగా వెళ్తున్న వాళ్లు తీవ్ర ఇబ్బందికి లోనైన ఘటన ఫిలిప్పీన్స్‌ లో చోటుచేసుకుంది. ఫిలిప్పీన్స్ ఆర్థిక రాజధాని మకాటి ప్రధాన రహదారి మధ్యలో వాహన చోదకులు, పాదచారులతో రద్దీగా ఉన్న ప్రాంతంలోని భారీ ఎలక్ట్రానిక్ బిల్ బోర్డ్ (ప్రకటనల బోర్డు) పై ప్రకటన స్థానంలో అశ్లీల దృశ్యాలు సుమారు 30 సెకన్ల పాటు ప్రత్యక్షమయ్యాయి.

వాటిని చూసిన స్థానికులు నివ్వెరపోయారు. కొందరు యువకులు వాటిని సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అవి వైరల్ గా మారాయి. ఈ ప్రసారాల కారణంగా ఆ మార్గంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీనిపై ఫిర్యాదులందడంతో మకాటి మేయర్‌ అబిగేల్‌ బినయ్‌ దీనిని నిర్వహిస్తున్న గ్లోబల్ ట్రానిక్స్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ బిల్‌ బోర్డ్‌ ను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీనికి కారణాలపై దర్యాప్తుకు ఆదేశించారు.
Go Back to Shorts
philippens
bill board scanes
trespassers shok

More Telugu News