భార్య కోసం ఇద్దరు భర్తల పోరాటం... పోస్టు మార్టం గదిలోకి పారిపోయిన భార్య!

  • గత ఏడాది త్రిలోక్ సింగ్ ను వివాహం చేసుకున్న కాంతాదేవి
  • ఈనెల 13న విజేంద్ర సింగ్ ను రెండో వివాహం చేసుకున్న వైనం 
  • కాంతాదేవి కోసం ఇద్దరు భర్తల ఫైట్
భార్య కోసం ఆసుపత్రిలో ఇద్దరు భర్తలు ఘర్షణకు దిగిన ఘటన రాజస్థాన్ లో కలకలం రేపింది. ఆశ్చర్యకరమైన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్ లోని అజ్మీర్ కు చెందిన కాంతాదేవికి త్రిలోక్‌ సింగ్‌ తో గత ఏడాది వివాహం జరిగింది. అతనికి విడాకులివ్వని కాంతాదేవి ఈనెల 13న విజేంద్ర సింగ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుని, అతనితో కలిసి ఉంటోంది.

అనారోగ్యకారణాలతో కాంతాదేవి తన రెండో భర్తను తీసుకుని అజ్మీర్ లోని ఒక ఆసుపత్రికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె మొదటి భర్త త్రిలోక్ సింగ్, తన స్నేహితులతో కలిసి ఆసుపత్రికి వచ్చి, తన భార్య, ఆమె రెండో భర్తపై దాడికి దిగాడు. దీంతో రెండో భర్తతో పాటు పోస్టుమార్టం గదిలోకి పారిపోయి కాంతాదేవి దాక్కుంది. దీనిపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ఈ వివాదం పోలీసు స్టేషన్ కు చేరింది. కాంతాదేవి నిర్వాకం విని ఆశ్చర్యపోయిన పోలీసులు, ఆమె ఎవరి భార్యో తేల్చలేక తలలు పట్టుకున్నారు
Go Back to Shorts
kanthadevi
trilok singh
vijendar singh
Rajasthan
ajmer

More Telugu News