కొత్త రూపం, అదనపు సామర్థ్యంతో జియోఫి 4జీ హాట్ స్పాట్... ధర రూ.999
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్త రూపం, అదనపు సామర్థ్యంతో జియోఫి 4జీ హాట్ స్పాట్... ధర రూ.999

  • ఫ్లిప్ కార్టులో మాత్రమే లభ్యం
  • 150 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ వేగం
  • పెరిగిన బ్యాటరీ సామర్థ్యం
రిలయన్స్ జియో నుంచి జియోఫి 4జీ ఎల్టీఈ హాట్ స్పాట్ JMR815 డివైజ్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ లోనే లభిస్తుంది. గతంలోని మోడల్ కంటే ఇందులో అదనపు సామర్థ్యాలు ఉండడం గమనార్హం. నూతన హాట్ స్పాట్ పరికరం ఏకంగా 150 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ వేగం, 50 ఎంబీపీఎస్ అప్ లోడ్ వేగంతో ఉంటుందని జియో పేర్కొంది.

పైగా పాత పరికరంతో పోలిస్తే దీని డిజైన్ లోనూ కంపెనీ మార్పులు చేసింది. గుండ్రటి రూపంలో, అదనపు బ్యాటరీ సామర్థ్యంతో తీసుకొచ్చింది. బ్యాటరీ సామర్థ్యం 3,000 ఎంఏహెచ్. ఒక్కసారి చార్జ్ చేస్తే నాన్ స్టాప్ గా 8 గంటల పాటు డేటా వినియోగానికి సపోర్ట్ చేస్తుంది. హెచ్ డీ వాయిస్, వీడియో కాల్స్ కు సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ.999
jiofi
4g hotspot

More Telugu News