పెళ్లి సందర్భంగా శ్రియ, ఆమె భర్త మధ్య సరదా సంభాషణ.. వీడియో చూడండి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెళ్లి సందర్భంగా శ్రియ, ఆమె భర్త మధ్య సరదా సంభాషణ.. వీడియో చూడండి

  • హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం
  • ఎరుపు లెహంగాలో మెరిసిన శ్రియ
  • భర్తను ముద్దాడిన శ్రియ
తన రష్యన్ ప్రియుడు ఆండ్రీ కొశ్చీవ్ ను హీరోయిన్ శ్రియ రహస్యంగా పెళ్లాడిన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది మాత్రమే హాజరైన ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వీరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఎరుపు రంగు లెహంగా, జువెలరీలో శ్రియ మెరిసిపోయింది.

ఈ సందర్భంగా వీరికి సంబంధించిన ఓ వీడియో వెలుగుచూసింది. ఈ వీడియో ప్రారంభంలో తన భర్తకు శ్రియ ఓ కిస్ పెట్టింది. అనంతరం కొశ్చీవ్ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, 'ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నారంటే... అది కేవలం నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని చూసే. మన ప్రేమ కోసం నీవు కొంచెం మారలేవా అని ఎవరైనా అడిగితే.. అది నిజమైన ప్రేమ కాదు. అది రాజీ పడటమే. కానీ ప్రేమ విషయంలో నేను, శ్రియ రాజీపడం' అని చెప్పాడు. వెంటనే శ్రియ కల్పించుకుని... 'అంటే దాని అర్థం నా పిచ్చితనాన్ని నీవు అంగీకరించినట్టేనా' అని అడిగింది. దానికి సమాధానంతో 'అవును' అంటూ కొశ్చీవ్ చెప్పాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
shriya
wedding
marriage
video

More Telugu News