Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొలి యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ లెస్ కారు... మహిళ మృతి!

  • అమెరికాలో ఘటన
  • డ్రైవర్ లెస్ కారు ప్రమాదంలో తొలి మరణం
  • సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను సస్పెండ్ చేస్తున్నాం
  • ప్రకటించిన ఉబెర్
సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా విస్తరించే దిశగా అడుగులు వేస్తుండగా, ఈ కార్లతో ఇబ్బందులూ ఉంటాయని తొలిసారి నిరూపితమైంది. అమెరికాలోని అరిజోనా పరిధిలోని టెంపీ ప్రాంతంలో ఉబెర్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు యాక్సిడెంట్ చేయగా, ఓ మహిళ చనిపోయింది. ప్రపంచంలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్ యాక్సిడెంట్ లో ప్రాణాలు పోవడం ఇదే తొలిసారి.

ఈ ఘటనతో అమెరికా, కెనడాల్లో తమ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను సస్పెండ్ చేస్తున్నట్టు ఉబెర్ పేర్కొంది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో కారు స్వీయ డ్రైవింగ్ నిబంధనల్లో ఉందని, వెహికిల్ ఆపరేటర్ కూడా స్టీరింగ్ ముందు కూర్చునే ఉన్నాడని టెంపీ పోలీసులు వెల్లడించారు. ఓ క్రాస్ వాక్ వద్ద మహిళ నడుస్తూ వెళుతుండగా, ఈ కారు ఢీకొందని, తీవ్ర గాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం తరలించగా, ఆసుపత్రిలో కన్నుమూశారని తెలిపారు. ఈ ఘటనతో డ్రైవర్ లెస్ కార్లపై చేస్తున్న పరీక్షలను నిలిపివేస్తున్నట్టు ఉబెర్ పేర్కొంది. మృతురాలి కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని, విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని ఉబెర్ టెక్నాలజీస్ ప్రతినిధి ఒకరు ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
UBER
Self Driving Car
Accident
USA
Arizona

More Telugu News