ఆన్లైన్లో ఆధార్‌ను పొందవచ్చంటూ వస్తోన్న వార్తలను నమ్మొద్దు: ఉడాయ్
- మేరా ఆధార్, మేరీ పెహచాన్ అని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే పీడీఎఫ్ రూపంలో పొందొచ్చని వార్తలు
- అందులో నిజం లేదని తేల్చి చెప్పిన ఉడాయ్
- వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్ ద్వారా వెల్లడించాలనుకుంటే జరభద్రం
అలాగే, ఆధార్ నెంబర్, ఇతర వ్యక్తిగత సమాచారం ఆన్లైన్ ద్వారా ఇతరులకు వెల్లడించే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది. ఇంతవరకు తమ డేటాబేస్ నుంచి ఒక్కరి ఆధార్ కార్డు వివరాలు కూడా బయటకు వెళ్లలేదని కూడా వివరణ ఇచ్చింది. ఎవరైనా అనధికారికంగా ఆధార్ కార్డుదారుల సమాచారాన్ని ఇంటర్నెట్లో పెడితే కేసులు నమోదు చేయాల్సి వస్తుందని తెలిపింది.