హిమాలయాల నుంచి అమెరికాకు రజనీకాంత్!
- గతవారం హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్
- మరో వారం తరువాత అమెరికాకు
- వైద్య పరీక్షల కోసమే
అమెరికాలో వైద్య పరీక్షల అనంతరం మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ తొలి వారంలో చెన్నై చేరుకుంటారని తెలిపాయి. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు తన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అవగాహనకు రావాలన్నది రజనీ ఆలోచనని, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నమవుతారని తెలుస్తోంది. కాగా, రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన సింగపూర్ లో చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.