హైదరాబాద్ యూనివర్శిటీలో కలకలం...విద్యార్థినిపై నలుగురు యువకుల అత్యాచారయత్నం
- హైదరాబాద్ యూనివర్శిటీ విద్యార్థినిపై నలుగురు యువకుల అత్యాచారయత్నం
- పోలీసుల అదుపులో ఒకరు...పరారీలో మరో ముగ్గురు
- నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్శిటీ విద్యార్థినుల డిమాండ్
మరోవైపు ఈ ఘటనను యూనివర్శిటీ విద్యార్థినులు తీవ్రంగా పరిగణిస్తూ దీనిపై యాజమాన్యం తగు విధంగా స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, బాధిత విద్యార్థిని ఓ వ్యక్తితో కలిసి మాట్లాడుతున్నప్పుడు నలుగురు యువకులు అక్కడికి వచ్చారని, వారు అతడ్ని బెదిరించి, ఆమెపై అఘాయిత్యానికి పూనుకున్నారని, ఆమె కేకలు వేయడంతో వారు భయపడి అక్కడి నుంచి పారిపోయారనే వార్త కూడా వినబడుతోంది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణ తర్వాతే అసలు నిజం బయటకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.