ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించింది .. చైతూ - సమంతల సినిమా మొదలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్యాన్స్ నిరీక్షణ ఫలించింది .. చైతూ - సమంతల సినిమా మొదలు

  • శివ నిర్వాణతో నాగచైతన్య 
  • కథానాయికగా సమంత
  • పెళ్లి తరువాత ఈ జంటకి తొలి మూవీ
ప్రస్తుతం నాగచైతన్య .. చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా చేస్తున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేస్తున్నాడు. ఈ రెండూ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతున్నవే .. చైతూ ఇంతవరకూ చేయని జోనర్ కి సంబంధించినవే. ఇవే కాకుండా దర్శకుడు శివ నిర్వాణతో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వివాహం తరువాత చైతూ .. సమంతలు చేస్తోన్న ఫస్టు మూవీ ఇదే.

ఈ రోజున ఈ సినిమా పనులను మొదలుపెట్టేశారు. "ఈ రోజు కచ్చితంగా చాలా కొత్త రోజు .. సమంతతో కలిసి వర్క్ చేయడానికి వెళుతున్నాను" అంటూ సమంతతో కలిసి కార్లో వెళుతోన్న సెల్ఫీని చైతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. సాహు గారపాటి .. హరీశ్ పెద్ది నిర్మిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.  
chaitu
samantha

More Telugu News