'సైరా' తారాగణంలో మరో సీనియర్ నటుడు?
- రూ.150 కోట్లతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'సైరా'
- మరో కీలక పాత్ర కోసం నాజర్ ఎంపిక
- చిరంజీవికి గాడ్ ఫాదర్ రోల్ పోషించనున్నట్లు సమాచారం
తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఓ సీనియర్ నటుడ్ని ఎంపిక చేసినట్లు సమాచారం. చిరంజీవికి గాడ్‌ఫాదర్ పాత్రను ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ పోషించనున్నారట. ఈ సినిమాలో నాజర్ పాత్ర చాలా కీలకమని, ఆయనైతేనే ఈ పాత్రకు బాగా సూటవుతారనే ఉద్దేశంతో ఆయన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఉయ్యాలవాడ వివాహానికి కారకులైన వారిలో నాజర్ పాత్ర కూడా ఒకటి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటున్నట్లు తెలిసింది.