తన ట్విట్టర్ ఖాతా పేరును మార్చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన ట్విట్టర్ ఖాతా పేరును మార్చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

  • ఇప్పటి వరకు ఆఫీస్ఆఫ్ఆర్జీ పేరు
  • దీన్నిరాహుల్ గాంధీగా మార్పు
  • పాత పేరుపై నెటిజన్ల విమర్శలు
రాహుల్ గాంధీ ట్విట్టర్ పేజీలో చిన్న మార్పు చోటు చేసుకుంది. మరేదో ఊహించుకోకండి. ఆయన తన ట్విట్టర్ మాధ్యమ పేజీ పేరును మార్చుకున్నారు. ఎందుకనీ అంటే... ఇంత వరకు ఆఫీస్ఆఫ్ఆర్జీ అని ఆయన ట్విట్టర్ పేజీని నడిపారు. అంటే రాహుల్ గాంధీ కార్యాలయం అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై విమర్శలు ఎక్కువగా వచ్చేవి. గొప్ప కోసం లేదా వెర్రితనంగా దీన్ని సామాజిక మాధ్యమంలో అభివర్ణిస్తూ కామెంట్లు పెట్టేవారు. తన ట్విట్టర్ ఖాతాలో తన పెంపుడు కుక్క ట్వీట్లు పెడుతుందంటూ ఆయన గతంలో విమర్శకులకు సమాధానంగా జోకులు పేల్చారు. మొత్తానికి విమర్శలు లేదా మరేదైనా కారణమేమో గానీ రాహుల్ గాంధీ ట్విట్టర్ పేజీ పేరు ఇప్పుడు రాహుల్ గాంధీగా మారిపోయింది.
Rahul Gandhi
Twitter

More Telugu News