సల్మాన్ ఖాన్ తన భర్త అంటూ ఓ యువతి హంగామా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సల్మాన్ ఖాన్ తన భర్త అంటూ ఓ యువతి హంగామా!

  • సల్మాన్ నివసించే గెలాక్సీ అపార్ట్ మెంట్ లో సంఘటన
  • సెక్యూరిటీ కళ్లు గప్పి లోపలికి వెళ్లిన ఓ వీరాభిమాని
  • చేతిలో ఇనుపరాడ్లు.. దగ్గరకు వస్తే చనిపోతానన్న వైనం
  • సముదాయించి ఆమెను కిందకు దించిన అగ్నిమాపక సిబ్బంది
బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సల్మాన్ ఖాన్ తన భర్త అంటూ ఓ వీరాభిమాని హల్ చల్ చేసింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో సల్మాన్ నివసించే గెలాక్సీ అపార్ట్ మెంట్ లో ఇటీవల ఈ సంఘటన జరిగింది. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కంటపడకుండా అపార్ట్ మెంట్ పైభాగానికి ఆ యువతి చేరుకుంది. సల్మాన్ తన భర్త అంటూ కేకలు వేయడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది, వెంటనే అక్కడికి చేరుకున్నారు.

అయితే, ఆ యువతి చేతిలో ఇనుపరాడ్లు ఉండటంతో, ఆమె దగ్గరకు వెళ్లేందుకు వారు సాహసించలేదు. పైగా తన దగ్గరకు వస్తే చనిపోతానంటూ బెదిరించింది. దీంతో, అగ్నిమాపక సిబ్బందికి సెక్యూరిటీ సిబ్బంది సమాచారమివ్వడంతో వారు అక్కడికి వెళ్లారు. ఆ యువతికి నచ్చజెప్పి ఎట్టకేలకు కిందకు దించారు. కాగా, ఇంత జరుగుతున్నప్పటికీ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. సల్మాన్ నటిస్తున్న ‘రేస్ 3’ చిత్రం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ అబుదాబిలో జరుగుతోంది. షూటింగ్ నిమిత్తం సల్మాన్ అబుదాబిలో ఉన్నాడు.
Bollywood
Salman Khan

More Telugu News