పవన్ వ్యాఖ్యలు చిన్నపిల్లల ఆటల్లా ఉన్నాయి: మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి చురకలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ వ్యాఖ్యలు చిన్నపిల్లల ఆటల్లా ఉన్నాయి: మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి చురకలు

  • తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి అమర్‌నాథ్ రెడ్డి 
  • పవన్ ఓ రాజకీయ నాయకుడిలా వ్యవహరించడం లేదు
  • పవన్ కల్యాణ్ ఎప్పుడు స్పందిస్తారో ఆయనకే తెలియదు
  • రాజకీయ స్వార్థంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు మండిపడుతున్నారు. తాజాగా తిరుపతిలో మంత్రి అమర్‌నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు చిన్నపిల్లల ఆటల్లా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పవన్ ఓ రాజకీయ నాయకుడిలా వ్యవహరించడం లేదని అన్నారు. పవన్ కల్యాణ్ ఎప్పుడు స్పందిస్తారో ఆయనకే తెలియదని చురకలంటించారు. పవన్ కల్యాణ్ రాజకీయ స్వార్థంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, అవినీతి రహిత పాలన అందిస్తోందని అన్నారు.
Pawan Kalyan
amarnath reddy
Andhra Pradesh

More Telugu News