రూ.10 ప్లాస్టిక్‌ నోట్లను తీసుకొస్తాం.. రూ.2000 నోట్లను రద్దు చేయం: కేంద్ర సర్కారు వివరణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రూ.10 ప్లాస్టిక్‌ నోట్లను తీసుకొస్తాం.. రూ.2000 నోట్లను రద్దు చేయం: కేంద్ర సర్కారు వివరణ

  • రూ.10 ప్లాస్టిక్‌ నోట్లను తీసుకొచ్చే క్రమంలో క్షేత్రస్థాయిలో ట్రయల్
  • కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్‌లలో ట్రయల్ 
  • ప్రస్తుతం ఉన్న రూ.500 నోట్ల సైజు 66ఎంఎంX150 ఎంఎం
  • రూ.2000 నోట్ల సైజు 66ఎంఎంX166 ఎంఎం
పాత పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఆర్‌బీఐ కొత్తగా రూ.2000 నోట్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ నోట్లను రద్దు చేస్తారని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఆర్థికశాఖ సహాయమంత్రి రాధాకృష్ణన్ లోక్‌సభలో స్పష్టతనిచ్చారు. రూ.2000 నోట్లను రద్దు చేసే ఉద్దేశం లేదని, మరోవైపు రూ.10 ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

రూ.10 ప్లాస్టిక్‌ నోట్లను తీసుకొచ్చే క్రమంలో క్షేత్రస్థాయిలో కొచ్చి, మైసూర్, జైపూర్, సిమ్లా, భువనేశ్వర్‌లలో ట్రయల్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. కాగా, ప్రస్తుతం ఉన్న రూ.500 నోట్ల సైజు 66 ఎంఎంX150 ఎంఎం ఉండగా, రూ.2000 నోట్ల సైజు 66 ఎంఎంX166 ఎంఎంగా ఉందని, వాటి సైజుల్లో 10 మిల్లీమీటర్ల తేడా ఉన్నందున తేలికగానే గుర్తించవచ్చని తెలిపారు.
currency
parliament
radha krishnan

More Telugu News