పవన్ కల్యాణ్ కు జలీల్ ఖాన్ సవాల్!
- నాపై పవన్ చేసిన ఆరోపణలు అవాస్తవం
- ఆరోపణలను నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటా
- బీజేపీ నుంచి ప్యాకేజ్ తీసుకున్నారు
రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న బీజేపీ గురించి పవన్ కల్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు. జనసేన వల్లే టీడీపీ గెలించిందనే విధంగా పవన్ మాట్లాడుతున్నారని... జనసేన, బీజేపీతో చేతులు కలపక ముందే మునిసిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిందని చెప్పారు. వాస్తవానికి ఆ పార్టీలతో కలవడం వల్ల, తమ ఓట్లు తగ్గిపోయాయని అన్నారు. మంత్రి లోకేష్ పై కూడా పవన్ కల్యాణ్ పసలేని ఆరోపణలు చేశారని... ఆ ఆరోపణలకు ఆయన వద్ద సాక్ష్యాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు.