అధునాతన ఫీచర్లతో వస్తున్న ఒప్పో ఎఫ్7... ఈ నెల 26న విడుదల
- ఆర్టిఫీషియెల్ టెక్నాలజీతో కొత్త ఫీచర్లు
- సెల్ఫీ కోసం ఏకంగా 25 మెగాపిక్సల్స్ కెమెరా
- 6.2 అంగుళాల ఫుల్ డిస్ ప్లే
ఈ ఫోన్ లో ఐఫోన్ ఎక్స్ తరహా స్క్రీన్ కనిపించనుంది. 6.2 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. సెల్ఫీల కోసం 25 మెగా పిక్సల్స్ సామర్థ్యం కలిగిన కెమెరాను ముందు భాగంలో ఏర్పాటు చేసినట్టు సమాచారం. రియల్ టైమ్ హెచ్ డీఆర్, ఏఆర్ స్టిక్కర్లు, బ్యూటీ మోడ్ ఫీచర్లుంటాయి. ఒప్పో ఇటీవలే సెల్ఫీ స్మార్ట్ ఫోన్ ఎ57ను రూ.14,990 ధరకు విడుదల చేసిన విషయం తెలిసిందే.