దాసరి నారాయణరావు .. రాఘవేంద్రరావు సెట్లో అలా ఉండేవారు: జయసుధ
- రాఘవేంద్రరావు గారి సెట్లో సరదాగా ఉండేది
- షూటింగ్ మొదలైతే సీరియస్ గా ఉండేవారు
- ఆలస్యంగా వస్తే దాసరి గారు అరిచేసేవారు
" దాసరి నారాయణరావు .. రాఘవేంద్రరావు ఇద్దరివి కూడా వేరు వేరు స్కూల్స్. రాఘవేంద్రరావుగారు ఉదయం 7 గంటలకి షూటింగ్ కి వచ్చేవారు .. సాయంత్రం 6 గంటలకి పేకప్ చెప్పేవారు. సెట్ లో అంతా సరదాగా నవ్వుతూ ఉండొచ్చు .. షూటింగ్ స్టార్ట్ అయితే మాత్రం ఆయన చాలా సీరియస్ గా ఉండేవారు. ఇక దాసరి గారి విషయానికి వస్తే, ఎవరైనా ఒక అయిదు నిమిషాలు లేట్ గా వచ్చినా తిట్టేసేవారు. సెట్లో పేకాడటం .. జోకులేయడం ఆయనకి ఎంతమాత్రం ఇష్టం ఉండేవి కావు" అంటూ చెప్పుకొచ్చారు.