నా పేరు ఇలియానా డి'క్రూజ్..ఇలియానా డి'సౌజా కాదు...!

  • తన ఇంటి పేరును మార్చి పలకడంపై గోవా గర్ల్ గుస్సా
  • హోం వర్క్ చేయాలంటూ టీవీ రిపోర్టర్‌కు సూచన
  • 'రైడ్' చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో ఇలియానా అసహనం
తన తాజా చిత్రం 'రైడ్' ప్రమోషన్ కార్యక్రమం సందర్భంగా గోవా ముద్దుగుమ్మ ఇలియానా డి'క్రూజ్ ఓ రిపోర్టర్‌పై కోపగించుకుంది. అందుకు కారణం, తన ఇంటి పేరును సదరు రిపోర్టర్ తప్పుగా పలకడమే. ఓ టీవీ రిపోర్టర్ ఉత్సాహంతో రైడ్ చిత్ర నటీనటులైన అజయ్ దేవగణ్, ఇలియానాలతో చిట్ చాట్ ప్రారంభించాడు. "నేడు, మీరు సూపర్ స్టార్ అజయ్ దేవగణ్, ఇలియానా డి'సౌజాలను కలుసుకోబోతున్నారు" అంటూ ఆ రిపోర్టర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. అయితే ఇలియానా పేరు చివర తన ఇంటి పేరును డిసౌజాగా చెప్పడంతో ఈ షాట్‌ను కట్ చేసి మళ్లీ  రీషూట్ చేశారు. తర్వాత కూడా ఆ రిపోర్టర్ ఇలియానా పేరును మధ్యమధ్యలో డిక్రూజ్ అని డిసౌజా అని పలుకుతూ వచ్చారు. దాంతో ఇలియానా కోపగించుకుంటూ 'మీరు హోమ్ వర్క్ చేస్తే మంచిది. మీరిలా నా పేరును మార్చి మార్చి పలకడం వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది' అంటూ చికాకు పడింది.
Go Back to Shorts
Ileana D’Souza
Ajay Devgn
Ileana D’Cruz
Raid

More Telugu News