'రంగస్థలం'లో ఆది పినిశెట్టి లుక్ అదుర్స్...!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రంగస్థలం'లో ఆది పినిశెట్టి లుక్ అదుర్స్...!

  • యువ రాజకీయ నేత పాత్రలో ఆది పినిశెట్టి
  • లాంతరు గుర్తుపై గ్రామ ప్రెసిడెంట్ పదవికి పోటీ
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొత్త లుక్
తమిళంలో హీరోగా దూసుకుపోతూ తెలుగులో విలన్‌తో పాటు తనకు దక్కిన పాత్రలకు వన్నె తీసుకొస్తున్న నటుడు ఆది పినిశెట్టి. 'సరైనోడు' సినిమాలో విలన్ పాత్రకు విమర్శకుల ప్రశంసలందుకున్న ఈ బ్యూటిఫుల్ విలన్ కమ్ హీరో ఇప్పుడు రామ్‌చరణ్ కథానాయకుడిగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న 'రంగస్థలం' చిత్రంలో ఓ డిఫరెంట్ పాత్రను పోషిస్తున్నారు. ఇందులో అతను చరణ్ అన్నగా ఓ యువ రాజకీయ నేత పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి కథంతా కూడా అతని పాత్ర చుట్టే తిరుగుతుందని సమాచారం. ఇందులో ఆది పాత్ర పేరు కే.కుమార్ బాబు. లాంతరు గుర్తుపై గ్రామ ప్రెసిడెంటు పదవికి పోటీ చేసే పాత్రలో అతను కనినిపిస్తాడు. 'రంగస్థలం -1985' పేరుకు తగ్గట్టుగానే ఆనాటి పరిస్థితులకు తగ్గట్టుగా ఆది పాత్రను తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఆ పాత్ర తాలూకూ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Rangasthalam
Aadhi Pinisetty
Lantern
Sarrainodu

More Telugu News