అక్కడి స్కూళ్లలో స్టూడెంట్లతో డాన్సులు నిషిద్ధం...!
- స్కూళ్లలో స్టూడెంట్ల డాన్సులపై పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం నిషేధం
- అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక
- నిషేధం సక్రమ అమలు బాధ్యత జిల్లా విద్యాశాఖాధికారులకు
"పోటీలు, తల్లిదండ్రుల దినోత్సవం, ఉపాధ్యాయుల దినోత్సవం చివరకు వక్తృత్వ పోటీల సందర్భంగా కూడా విద్యార్థులు పాకిస్తానీ, భారతదేశ సినిమా పాటలకు డాన్సులు చేయడం ఆనవాయతీగా వస్తోంది" అని ప్రభుత్వ నోటీసు పేర్కొంది. అయితే ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం, సందర్భంతో పనిలేకుండా పాఠశాలల్లో డాన్సులు చేయడం నిషిద్ధం. ఈ నిషేధాజ్ఞలు పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు రెండింటికీ వర్తిస్తాయి. నిషేధం సక్రమంగా అమలయ్యేలా చూడాలని ప్రావిన్స్ సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.